హైదరాబాద్ కు మాణిక్ రావు థాక్రే
1 min readకాంగ్రెస్ తెలంగాణ కొత్త ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయనకు స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్న మాణిక్ రావు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. పార్టీ సీనియర్లతో ఆయన విడివిడిగా మాట్లాడనున్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో మాణిక్ రావు భేటీ అవుతారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన కొందరు సీనియర్లు అసమ్మతిని వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్రానికి మాణిక్ రావు కొత్త ఇంఛార్జిగా అధిష్టానం నియమించింది. మహారాష్ట్రకు చెందిన థాక్రే పార్టీలో సీనియర్ నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా, మహారాష్ట్ర మంత్రిగా గతంలో పనిచేశారు. మాణిక్ రావు రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు తొలగిపోతాయని పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు.