శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్*

*శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్*

*జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తమిళనాడు సీఎం*

*​వేదాశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు అందజేసిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు*

*​సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసి భక్తులకు చేతులెత్తి అభివాదం చేసిన ముఖ్యమంత్రి*

​ఇంద్రకీలాద్రి (విజయవాడ):
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ విజయ్ మంగళవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
​ఇంద్రకీలాద్రికి విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రధానాలయంలోకి తోడ్కొని వెళ్లారు.సంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి చేరుకున్న ఆయన, క్యూలైన్లలో ఉన్న భక్తులకు చేతులెత్తి నమస్కరిస్తూ అభివాదం చేశారు. అనంతరం అంతరాలయంలో శ్రీ అమ్మవారిని దర్శించుకుని, విశేష పూజలు నిర్వహించారు.దర్శనానంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn