మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి
1 min readపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ సభ్యత్వంపైన తన ఛాలెంజ్ ను నిలబెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన టార్గెట్ ను ఆయన రెండు నెలల్లో పూర్తి చేయించారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లుగానే పార్టీ 30 లక్షల డిజిటల్ సభ్యత్వాన్ని పూర్తి చేసుకుంది. ఇంకా మెంబర్ షిప్ కొనసాగుతూనే ఉండటం విశేషం. నల్గొండ లోక్ సభ స్థానం పరిధిలో 4 లక్షలకు పైగా సభ్యత్వం నమోదు కావడం విశేషం. ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో పాటు స్థానిక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ భారీ మెంబర్ షిప్ జరిగింది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో దాదాపు లక్ష సభ్యత్వం జరిగినట్లు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో స్థానిక నేతలు క్రియాశీలకంగా వ్యవహారించి మెంబర్ షిప్ లో పాల్గొన్నారు. భారీ మెంబర్ షిప్ చేయించడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయి ఎంత బలంగా ఉందో నిరూపించామని నాయకులు చెపుతున్నారు. మరో వైపు పార్టీ సభ్యత్వం నమోదు టార్గెట్ ను చేరుకున్న రేవంత్ రెడ్డి ఎఐసిసి డిజిటల్ మెంబర్ షిప్ ఛైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి అభినందించారు.