అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ షోకాజ్ నోటీస్

1 min read

టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం చైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ లో ఆదివారంనాడు జరిగింది.తుంగతుర్తి నియోజక వర్గంలో పోటీ చేసిన అభ్యర్థి అద్దంకి దయాకర్ కు షో కాజ్ నోటీస్ ఇవ్వాలని నిర్ణయం.ఢిల్లీ లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లపై క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడినందుకు ఆయనపై మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ పరిశీలించి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని వారం రోజులలో జవాబు ఇవ్వాలని నిర్ణయం..

జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో పోటీ చేసిన మదన్ మోహన్ తన పరిధిలో చేసే కార్యక్రమాలు పార్టీ పేరుతో కాకుండా myf మదన్ యూత్ ఫోర్స్ పేరుతో చేస్తున్నారని దీనిపై కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదన్ మోహన్ కు లేఖ రాయాలని ఇక నుంచి ఏ కార్యక్రమాలు చేసిన అవి పార్టీ పరిధిలోనే చేయాలని పార్టీ లోని నాయకులంతా ఆహ్వానించాలని పేర్కొంటూ లేఖ రాయాలని నిర్ణయం.. అలాగే ఇటీవల ఎల్లారెడ్డి లో పార్టీ నాయకులకు సమాచారం లేకుండా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారని ఇలాంటివి కూడా భవిష్యత్ లో చేయకుండా ఉండాలని పేర్కొన్నారు.

అలాగే కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ ను సస్పెండ్ చేస్తున్నట్టు వీడియో సమాచారం ఇచ్చారని కానీ అలా సస్పెండ్ చేసే అధికారం డీసీసీ అధ్యక్షులకు లేదని ఆ సస్పెన్షన్ చెల్లదని పేర్కొంటూ ఆయనకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ విషయంలో మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే అవి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం దృష్టికి తేవాలని, నేరుగా సస్పెండ్ చేసే అధికారం లేదని లేఖలో పేర్కొనాలని నిర్ణయించారు..

దుబ్బాక నియోజక వర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీ కి సంబంధించిన వారిని ఎస్సి ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి కి లేఖ రాసి వారిని పిలిపించి సమస్యను పరిష్కరించాలని సూచించడం జరిగింది.

జనగామ డీసీసీ అధ్యక్షులు జంగా రఘువరెడ్డి తన డీసీసీ పరిధి దాటి పోయి వరంగల్ పరిధిలో రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జంగా రాఘవ రెడ్డి లేఖ రాయాలని నిర్ణయం.. జనగామ డీసీసీ పరిధిలో అలాగే తాను పోటీ చేసిన పాలకుర్తి అసెంబ్లీ పరిధిలో రాజకీయ కార్యక్రమాలు చేసుకోవాలని సూచిస్తూ లేఖ రాయాలని నిర్ణయం..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn