శోభానాగిరెడ్డికి నివాళి
1 min readశోభానాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా భూమా ఘాట్ వద్ద తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి తో కలిసి మాజీ మంత్రి అఖిలప్రియ నివాళ్ళర్పించారు. వందలాది మంది భూమా అభిమానులు ఘాట్ కు చేరుకొని శ్రద్దాంజలి ఘటించారు. శోభానాగిరెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు. ఆమె భర్త భూమా నాగిరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. వీరి పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి విజయం సాధించిన టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహారించారు. గత ఎన్నికల్లో అఖిలప్రియ ఆళ్లగడ్డలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆమె తెలుగుదేశంలో పనిచేస్తున్నారు.