మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి
1 min readపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిశారు. మధ్యప్రదేశ్ లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి నడిచారు. తెలంగాణలో పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీని రేవంత్ కలవడం ఇదే మొదటి సారి. గత వారం రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఆయన సమావేశమై తెలంగాణలో పార్టీ పరిస్థితిపైన వివరించారు. పార్టీ రాష్ట వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తో కలిసి పీసీసీ కార్యవర్గం కూర్పుపైన చర్చించారు. డిసెంబర్ మొదటి వారంలో రేవంత్ రెడ్డి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశముంది.