పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊరట
1 min readపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన పారిశ్రామికవేత్త మైహోం రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసు ను హైకోర్టు కొట్టివేసింది. గచ్చిబౌలి లో మై హోమ్ భూజ నిర్మాణంపై రేవంత్ రెడ్డి పలుసార్లు మీడియా లో మాట్లాడారు. తక్కువ ధరకే భూమిని తీసుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దీని పైన మైహోం రామేశ్వరరావు 90 కోట్లకు పరువు నష్టం దావా చేశారు. దీని పైన గత కొంత కాలంగా విచారణ జరుగుతోంది. సరైన ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు కేసును కొట్టివేసింది..