ప్రతి గింజను కొనాల్సిందే.. రాహుల్ గాంధీ
1 min readతెలంగాణలో పండించే చివరి గింజ కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ తమ నైతిక బాధ్యతలను విస్మరించాయని ఆయన ట్విట్ చేశారు. వరి కొనుగోలుపైన ప్రభుత్వాల తీరును తప్పు పడుతు రాహుల్ గాంధీ తెలుగులో ట్విట్ చేశారు. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటని ఆయన వ్యాఖ్యానించారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలను క్షోభ పెట్టడం ఆపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
వరి కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విట్ చేయడం విశేషం. నెల రోజుల పాటు కార్యాచరణను ప్రకటించిన పీసీసీ వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రైతు బహిరంగ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. సీనియర్ నాయకులు మండలాల్లో పర్యటించి రైతులను చైతన్యవంతం చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు క్షేత్ర స్థాయి పోరాటాలు చేసిన తర్వాత రైుతలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు.