ఢిల్లీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
1 min readకాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాలపైన అధిష్టానం సమీక్షించింది. పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపైన ఖర్గే ఆరా తీశారు. వరసగా ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తీరు, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపైన ఆయన చర్చించారు. మునుగోడులో పార్టీ నేతలు కష్టపడినప్పటికి డిపాజిట్ దక్కకపోవడంపైన ఖర్గే సమీక్షించారు. సీనియర్ నాయకులు, నియోజకవర్గ నేతలతో మరింత కో ఆర్డినేషన్ చేసుకోవాలని రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు. పీసీసీ నుంచి సమన్వయం లేదంటు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని ఖర్గే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గంతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామకం చేయాలని రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు.