ఖర్గేతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ
1 min readపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు.అమెరికా పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ఆయన ఖర్గేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడికి వివరించారు. వచ్చే పదిహేను రోజుల్లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే తెలంగాణ సీనియర్లతో పార్టీ కేంద్ర నాయకత్వం సమావేశం కానున్నది. దీంతో పాటు మాజీ ఎంపి పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి తో పాటు పలువురు కాంగ్రెస్ లో చేరనున్నారు. దీనిపైన రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో చర్చించినట్లు సమాచారం.