బీజేపీకి రాజీనామా చేస్తా.. రాజాసింగ్ సంచలనం
1 min read
ఎమ్మెల్యే రాజాసింగ్ తన సొంత పార్టీ బీజేపీ పైన తిరుగుబాటు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి తన అవసరం లేదని వెళ్లిపోతానని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ కి రాజీనామా చేయడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. పార్టీలో కొంత మందిలా తనకు బ్రోకరిజం చేయడం రాదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పైన రాజాసింగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను సూచించిన వ్యక్తికి కాకుండా ఎంఐఎం పార్టీతో కలిసి తిరిగే వ్యక్తిని అధ్యక్షుడిని చేశారని ఆయన ధ్వజమెత్తారు.