హరీష్ రావుకు షాక్.. రేవంత్ రెడ్డి ఇంట్లో మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
1 min readముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు సమావేశమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు గులాబీ పార్టీ శాసనసభ్యులు సీఎంను కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ,పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి , జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశామని బీఆర్ఎస్ శాసనసభ్యులు చెబుతున్నారు. అయితే ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే హరీష్ రావు మాత్రం ఈ భేటీకి దూరంగా ఉన్నారు. హరీష్ రావుకు తెలిసే ఈ సమావేశం జరిగిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మొదటి బీఆర్ఎస్ శాసనసభ్యులు మెదక్ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.