కొండా సురేఖ రాజీనామా
1 min read
పీసీసీ కార్యవర్గంపైన మాజీ మంత్రి కొండా సురేఖ తన అసంత్రుప్తిని వ్యక్తం చేశారు. తనను పీసీసీ ఎక్జిక్యూటీవ్ కమిటీలో సభ్యురాలిగా నియమించడాన్ని తప్పుపట్టారు. పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తనకు స్థానం కల్పించకపోవడాన్ని కొండా సురేఖ ప్రశ్నిస్తున్నారు. ఇది తనకు అవమానమేనన్న ఆమె పీసీసీ ఎక్జిక్యూటీవ్ కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కొండా సురేఖ స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అందజేశారు. తనకు పదవులు ముఖ్యం కాదన్న ఆమె ఆత్మాభిమానమే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఒక్క నాయకుడికి తగిన పదవి ఇవ్వలేదని సురేఖ అన్నారు. పరకాల,వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు కొండా మురళీ, తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని ఆమె అన్నారు .కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతామని సురేఖ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చారు.