చంద్రబాబు స్వల్ప ఊరట

1 min read

గత నెల రోజులుగా న్యాయపోరాటం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి కోర్టుల్లో స్వల్ప ఊరట లభించింది. రెండు కేసుల్లో ఆయనకు తాత్కాలిక బెయిల్ లభించింది. అంగళ్లు కేసులో గురువారం వరకు ఆయనను అరెస్ట్ చేయోద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సోమవారం వరకు చంద్రబాబుకు ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసుపైన శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పునిచ్చే సూచనలున్నాయి. 17 ఎ ఈ కేసుకు వర్తిస్తుందని చంద్రబాబు తరుపు న్యాయవాదులు, వర్తిస్తుందని సీఐడీ తరుపు లాయర్లు కోర్టులో వాదిస్తున్నారు. ఈ వాదనలపైన సుప్రీం కోర్టు శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించనున్నాది. ఒక వేళ కోర్టు రిమాండ్ రిపొర్ట్ ను కొట్టివేస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో ఆయనను అంగళ్లు లేదా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టు ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn