గవర్నర్ తమిళసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్య రాజన్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి కి తన రాజీనామా లేఖను ఆమె పంపించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆమె అందుకు వీలుగా గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. పుదుచ్ఛేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవికి కూడా తమిళిసై రిజైన్ చేశారు. తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నట్లు సమాచారం.