కాంగ్రెస్ కు పొన్నాల రాజీనామా
1 min readఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. జనగాం టికెట్ తనకు కేటాయించే అవకాశాలు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పొన్నాల బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ నెల 16 న కేసీఆర్ జనగాం బహిరంగ సభలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్న ట్లు సమాచారం. కాంగ్రెస్ కు రాజీనామా చేస్తు లేఖను ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కు పంపించారు. బీసీలకు పార్టీ లో అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని పొన్నాల ధ్వజమెత్తారు.