ముందు కేసీఆర్ వ్యాక్సిన్ వేయించుకోవాలి
1 min readకరోనా వ్యాక్సిన్ పైన దేశంలో చర్చోపర్చలు జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ విమర్శలు ప్రారంభమయ్యాయి. వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తికాకుండానే ఎందుకు తీసుకువస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. హడావుడిగా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉండదని పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రధాని మోదీ మొదట వ్యాక్సిన్ వేయించుకోవాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో కూడా సి.ఎం కేసీఆర్, కేటీఆర్ మొదట వ్యాక్సిన్ వేయించుకోని ఆదర్శంగా నిలబడాలని మాజీ ఎం.పి మధు యాష్కీ స్పష్టం చేశారు. అమెరికాలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, కాబోయో అధ్యక్షుడు వ్యాక్సిన్ తీసుకున్నారని ఆయన అన్నారు. ప్రజల్లో నెలకొన్న అనుమానాలు పోవాలంటే కేసీఆర్,కేటీఆర్ ముందుకు రావాలని యాష్కీ డిమాండ్ చేశారు.