కెసి వేణుగోపాల్ ఇంట్లో సిద్దరామయ్య,డీకె
1 min readకర్ణాటక ముఖ్యమంత్రి ఎవరో తెలిపోయింది. సీనియర్ నేత సిద్దరామయ్య వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపించింది. డీకె శివకుమార్ మొండి పట్టుతో మూడు రోజుల పాటు మల్లగుల్లాలు పడిన హైకమాండ్ చివరకు ఆయనను ఒప్పించి తుది నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ నివాసంలో సిద్దరామయ్య, డీకె శివకుమార్ కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. మంత్రి వర్గ కూర్పుపైన వీరి మధ్య చర్చ జరిగింది. సిఎం ఎవరన్నదానిపైన క్లారిటీ రావడంతో ఒకటి రెండు రోజుల్లో ప్రమాణస్వీకారానికి సిద్ధరామయ్య సిద్దమౌతున్నారు.