కేసీఆర్ కోవర్టు కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి క్రిష్ణారావు తేల్చి చెప్పారు. బీజేపీ,బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో తనను గెలిపించినందుకు గురుదక్షణ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కోసం లోపాయికారీ గా వ్యవహరిస్తున్నారని మంత్రులు విరుచుకుపడ్డారు. గత మూడు ఎన్నికల్లో జూబ్లీహల్స్ నియోజకవర్గంలో బీజేపీ కి వచ్చిన ఓట్ల సంఖ్యను వారు మీడియా ముందు ఉంచారు.
2018 ఎన్నికల్లో
Brs – 68,979
కాంగ్రెస్ – 52,975
బీజేపీ – 8,517
2023 ఎన్నికల్లో
Brs – 80,549
కాంగ్రెస్ – 64212
బీజేపీ – 25866
2024 పార్లమెంట్ ఎన్నికల్లో
కాంగ్రెస్ కి 89,705 ఓట్లు రాగా
బీజేపీ – 64,673
Brs – 18,405
2023 శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 25 వేల ఓట్లు సాధిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అదే శాసభ సభ నియోజకవర్గం నుండి 64 వేల ఓట్లు బీజేపీ కి ఎలా వచ్చాయని మంత్రులు ప్రశ్నించారు.
2023 శాసన సభ ఎన్నికల్లో 80 వేల ఓట్లు వస్తె పార్లమెంట్ లో brs కు కేవలం 18 వేల ఓట్లు ఎందుకు వచ్చాయన్నారు.
పార్లమెంట్ లో మీకు brs మద్దతు ఇస్తే శాసన సభలో brs కి మీరు మద్దతు ఇవ్వడం వల్లే లోపాయికారి ఒప్పందం వల్లే ఓట్లు పెంచుకున్నారని మంత్రులు స్పష్టం చేశారు.
