ప్రతిపక్షాల భరతం పట్టేందుకే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పైన కేంద్రం దిగివచ్చేలా సభ నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగసభ జరుపుతున్నట్లు మహేష్ గౌడ్ వివరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యవహారం బీసీ బిడ్డలా లేదన్నారు.బండి సంజయ్ దేశ్ ముఖ్ అని గతంలో తాను వ్యాఖ్యానించానని ,ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు. దోచుకున్న సొమ్మును గురించి కవిత ఒప్పుకోవడం హర్షించదగ్గ పరిణామనని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఐదేళ్ళ ముందు దోచుకున్న సొమ్ము గురించి కవిత చెప్పి ఉంటే కవితను సన్మానించే వాళ్లమన్నారు. కవితకు కేసిఆర్ ఆడించే డ్రామా అని సందేహం కల్గుతోందని, కేసిఆర్ కుటుంబం అంత దొంగలేనని ధ్వజమెత్తారు. కేసిఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని మహేష్ గౌడ్ జోస్యం చెప్పారు. 15 వ తేదీన కామారెడ్డి వేదికగా లక్షల మందితో సభ నిర్వహిస్తున్నామన్నారు.