ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం కమిటీ
1 min readగ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మార్చిలో ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా క్యాండిడెట్లను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ ,వామపక్షాలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించడంతో కాంగ్రెస్ తొందరపడుతోంది. రంగారెడ్డి,హైదరాబాద్,మహబూబ్ నగర్ తో పాటు నల్గొండ,ఖమ్మం,వరంగల్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఇందు కోసం కాంగ్రెస్ ఒక కమిటీని నియమించింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఈ కమిటీలో పీసీసీ ఛీప్ ఉత్తమ్, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క,,వర్కింగ్ ప్రెసిండెట్లు రేవంత్ రడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, అజారుద్దీన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ అభ్యర్థుల పేర్లను పరిశీలించి అధిష్టానానికి పంపిస్తుంది. కమిటీ సిఫారసు మేరకు హైకమాండ్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నది. హైదరాబాద్,మహబూబ్ నగర్, రంగారెడ్డి గ్రాడ్యువేట్ నియోజకవర్గానికి మాజీ మంత్రి చిన్నారెడ్డి పేరు పరిశీలిస్తున్నారు. ఖమ్మం,వరంగల్,నల్గొండ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తో పాటు పలువురు పేర్లపైన చర్చ జరుగుతోంది.