జనసేనలోకి కమెడియన్ పృథ్వీ రాజ్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ జనసేనలో చేరికలు ఊపందుకుంటున్నాయి. జనసేన లో చేరతామని ఇప్పటికే పలువురు నేతలు ప్రకటించగా మరికొందరు కండువా కప్పుకుంటున్నారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. వైసీపీ మాజీ నేత , సినిమా నటుడు పృథ్వీ రాజ్ కూడా జనసేన కండువా కప్పుకున్నారు. మరోవైపు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఆయన త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నారు.