కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే రాజయ్య
1 min readబీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే రాజయ్య గుడ్ బై చెప్పబోతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. పార్టీ తీరు తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని రాజయ్య చెబుతున్నారు. ఆరు నెలలుగా పార్టీ తన పట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన, టికెట్ ఇవ్వకపోయినా కేసీఆర్ కు విధేయుడిగా ఉన్నానని రాజయ్య చెప్పుకోచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరిగా లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని నాయకులు చెప్పడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదని రాజయ్య అన్నారు. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ దెబ్బతింటోందని ఆయన స్పష్టం చేశారు.