కూల్చివేతలు కొనసాగుతాయి.. సీఎం రేవంత్ రెడ్డి
1 min readబీఆర్ఎస్, బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిసోడియా, కేజ్రీవాల్ కు రానీ బెయిల్ ..ఐదు నెలల్లోనే కవితకు ఎలా వచ్చిందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బెయిల్ కోసం ఎంపీ సీట్లను బీఆర్ఎస్ త్యాగం చేసిందన్నారు. మెదక్, సిరిసిల్ల ,సిద్దిపేట, గజ్వేల్లో బీజేపీ కి మెజారిటీ ఇచ్చిందన్నారు. ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయి,, 15 చోట్ల మూడవ స్థానం వచ్చేంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా అన్న అనుమానాన్ని సీఎం వ్యక్తం చేశారు.చెరువుల కబ్జాపై నిజనిర్ధారణ కమిటీకి ప్రభుత్వం సిద్ధమని, కమిటీకి హరీష్ రావు నేతృత్వం వహించినా పర్వాలేదన్నారు. కెసిఆర్ ప్రభుత్వం 2018-24 వరకు రుణమాఫీ చేసింది 13,329 కోట్లు మాత్రమేనని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మా ప్రభుత్వం 27 రోజుల్లో 18 వేలకోట్లు రుణమాఫీ చేసిందన్నారు. రైతును రుణవిముక్తి చేయడం మా లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టెక్నికల్ అంశాలతో రుణమాఫీ జరగని వారు కలెక్టర్ కు వివరాలు ఇవ్వాలని ఆయన సూచించారు. రుణమాఫీ కానీ వారి వివరాలు కేటిఆర్,హరీష్ లు కూడా ఇవ్వొచ్చునని రేవంత్ రెడ్డి అన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతపై కేసిఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తెలుసన్నారు. ప్రజల ప్రయోజనం కోసమే హైడ్రా తెచ్చామన్నారు. చెరువులో నిర్మాణాలు చేస్తే ఎంతటి వారైనా ఒకటేనన్న ఆయన యుద్ధ ప్రాతిపాదికన కూల్చివేతలు పూర్తిచేస్తామన్నారు. లీడర్స్, హీరోలు ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాలి