ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు
1 min readరాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ప్రతీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్ తో పాటు సంక్షేమ పథకాలన్నిటికీ ఇక ఒకే కార్డులో ఉండబోతున్నాయి.వన్ స్టేట్… వన్ డిజిటల్ కార్డ్ విధానంతో ముందుకెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలను పొందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందనున్నాయి.అందులో ప్రతీ ఒక్కరి హెల్త్ పొఫైల్ ఉండాలని సీఎం సూచించారు. అర్హులందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్ కు జిల్లాలవారీగా ఒక వ్యవస్థ ఉండాలని ,రాజస్థాన్, హర్యానా, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.