విజయవంతంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్

1 min read

తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతం గా ముగిసింది.

16న జపాన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం ఏడు రోజుల పర్యటన మంగళవారం హిరోషిమా సందర్శనతో పూర్తయింది.

జపాన్​ నుంచి ముఖ్యమంత్రి హైదరాబాద్ కు బయల్దేరారు.

ముందుగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయల్దేరుతారు.

రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు

■ జపాన్ పర్యటనలోనూ పెట్టుబడులతో పాటు తెలంగాణ ప్రభుత్వం సరి కొత్త లక్ష్యాలను చేరుకుంది.

■ తెలంగాణలో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

■ అంతర్జాతీయ సంబంధాలు, పరస్పర సహకార సంప్రదింపులు జరపడంలో కొత్త అధ్యాయానికి తెర లేపింది.

■ జపాన్​లో పేరొందిన కంపెనీలతో రూ.12062 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో దాదాపు 30,500 కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.

■ జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు..50 వేల ఉద్యోగాలు

■ జనవరిలో అమెరికా, సౌత్ కొరియా, సింగపూర్ లో తెలంగాణ రైజింగ్​ ప్రతినిధి బృందం పర్యటించింది. రూ.14,900 కోట్ల పెట్టుబడులు సాధించింది.

■ గత ఏడాది 2024 దావోస్​ పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి (2023 డిసెంబర్​) నుంచి ఇప్పటివరకు సాధించిన
మొత్తం పెట్టుబడులు: రూ. 2,44,962 కోట్లు

ఉద్యోగ అవకాశాలు: 80,500

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn