జైలు నుంచి బయటకు చంద్రబాబునాయుడు
1 min readతెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు,వేలాది మంది కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. యాభై రెండు రోజుల పాటు చంద్రబాబునాయుడు జైలు ఉన్నారు. తాజాగా హైకోర్టు ఆయనకు మద్యంతర బెయిల్ ఇచ్చింది. ఆరోగ్యకారణాలను ద్రుష్టిలో ఉంచుకొని పలు షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడంతో తెలుగుదేశం శ్రేణులు ఉత్సవాలు జరుపుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కార్యకర్తలు అనేక చోట్ల బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.