ఆస్పత్రి బెడ్ నుంచే …
1 min read కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆస్పత్రి బెడ్ నుంచే ఆఫీస్ పని చేస్తున్నారు. గాయాల నుంచి కోలుకుంటున్న ఆయన ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. శ్రీపాద నాయక్ ఇటీవల యాక్సిడెంట్ కు గురయ్యారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మంత్రి సతీమణి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన శ్రీపాద్ నాయక్ గోవాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంతటి విషాదంలో కూడా పని పట్ల నాయక్ చూపిస్తున్న అంకితభావం అందరిని ఆకట్టుకుంటోంది.