మధురై కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
1 min readబీఆర్ఎస్ ఎమ్మెల్యే లు పాడి కౌశిక్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మధురై కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ వేసిన ఓ పరువు నష్టం కేసులో వీరిద్దరు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దగ్గర కోట్లాది రూపాయల ముడుపులు తీసుకున్నారని కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి మీడియాలో ఆరోపించారు. వీరిద్దరి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా వేశారు. క్షమాపణ చెప్పాలని నోటీసులిచ్చారు. అయితే నోటీసులను ఎమ్మెల్యే లిద్దరు పట్టించుకోక పోవడంతో ఆయన కోర్టుకు లాగారు.