కాలు జారిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
1 min read
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయన ప్రమాదవశాత్తు జారిపడటంతో కాలు విగిరినట్లు సమాచారం. ఆయనను హుటావుటిన హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం విచారణ కోసం బయలుదేరుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పల్లా ఫామ్ హౌస్ కు వెళ్లారు.