మా కార్పొరేటర్లను టచ్ చేశారో…..
1 min read
తమ పార్టీ కార్పొరేటర్లను టచ్ చేస్తే టీఆర్ఎస్ ను వదిలిపెట్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.తమ వాళ్లను ఒక్కరిని తీసుకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగి ఇన్ని రోజులైనా ఎందుకు మేయర్ ఎన్నిక జరపడం లేదని సంజయ్ ప్రశ్నించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే జనం నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే టీఆర్ఎస్ వేచి చూస్తోందని ఆయన అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు.కార్పొరేటర్లతో ఆలయం ముందు పార్టీ నాయకులు ప్రమాణం చేయించారు.