రైతులను ఆదుకుంటాం..

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రులు తుమ్ముల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ లో అకాల వర్షాలకు వరి, మిరప పంటను మంత్రులు పరిశీలించారు.
పంటలు ఎక్కడెక్కడ నష్టపోయాయో అధికారులు ఫీల్డ్ కి వెళ్లి వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.