గోమాత గొప్పతనం
1 min read
ఓ ఆవు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆవు తీరు పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.గోమాత గొప్పతనాన్ని ఈ ఆవు చాటిచెప్పిందని కొనియాడుతున్నారు. ఓ గోశాలకు చెందిన ఆవు గర్భంతో ఉంది. అడవిలో మేతకు వెళ్లిన ఆ ఆవు అక్కడే ఓ దూడకు జన్మనిచ్చింది.రాత్రి అంతా అక్కడే గడిపిన ఆవు ఉదయాన్నే గోశాలకు తిరిగి వచ్చింది. అప్పుడే పుట్టిన దూడ తన వెంట నడవలేక అక్కడే ఉండిపోయింది. దీంతో గోశాల సంరక్షకులను వెంట పెట్టుకొని తన దూడ ఉన్న ప్రదేశానికి దూరి చూపిస్తు తీసుకెెళ్లింది. ఆవు అడవిలోకి తీసుకెళ్తున్న ద్రుశ్యాలను సంరక్షకులు వీడియోలో బంధించారు. దీంతో గోమాత గోప్పతనం వైరల్ గా మారింది.