నల్గొండ గద్దర్ నర్సన్న కన్నీటి పాట
1 min readతెలంగాణ సుప్రసిద్దగాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్న పాటలు అందరికి సుపరిచతమే. ప్రధానంగా రాజకీయ పార్టీలు, నాయకుల కోసం ఆయన పాడే పాటలు కార్యకర్తలను ఉత్సాహపరుస్తుంటాయి. పొలిటికల్ సాంగ్స్ తో పాటు మానవవ సంబంధాలపైన నర్సన్న పాడే పాటలు అందరిని అలరిస్తున్నాయి. తన తండ్రి, తల్లిపైన ఆయన పాడిన పాటలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఈ పాటలకు యూబ్యూట్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. తాజాగా నల్గొండ గద్దర్ అన్న కుమారుడు కరుణాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కరుణాకర్ తో ఉన్న అనుబంధంతో నర్సన్న పాటను రూపొందించారు. ఈ పాట ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.