రూ. 20 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్, సర్వేయర్

ఏకంగా రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ ఓ తహశీల్దార్, సర్వేయర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం లేఅవుట్‌ను జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక ఇవ్వడం కోసం అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాసులు రూ. 20 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని, డబ్బులు తీసుకుంటున్న సమయంలో వారిని పట్టుకున్నారు.ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడటం ఇదే తొలిసారి అని సమాచారం.
