తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. ఆడబిడ్డల ఆత్మీయ వేడుక.. బతుకమ్మ పండుగ..రేవంత్ రెడ్డి

తెలంగాణ ఆడబిడ్డల అతిపెద్ద పండుగ, సింగిడి రంగుల పూల సంబరం బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ, ప్రకృతి అందాలను పూలలో కొలువుదీర్చే ఈ పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాలను, ప్రతి గుండెలో సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.గౌరమ్మ తల్లి ఆశీస్సులతో ఆడబిడ్డలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ముఖ్యమంత్రి గారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

Bathukamma: A Symbol of Telangana Culture and a Celebration of Women | CM Revanth Reddy

#Bathukamma #BathukammaFestival #RevanthReddy #TelanganaCulture #TelanganaFestivals #తెలంగాణసంస్కృతి #బతుకమ్మ #TelanganaNews #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn