రూ.2 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్వో, హెల్త్ ఇన్స్పెక్టర్

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) స్వర్ణకుమారి, హెల్త్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస్, ఆయన ప్రైవేట్ డ్రైవర్ మద్దూరికృష్ణయ్య ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఫిజియోథెరపీ సెంటర్కు సంబంధించిన అనుమతుల కోసం రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి, అందులో రూ.1 లక్ష స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీజ్ చేసిన ఫిజియోథెరపీ సెంటర్కు తిరిగి అనుమతులు ఇవ్వడం, కొత్త DM&HO లైసెన్స్ జారీ కోసం లంచం డిమాండ్ చేశారు. ఇందుకోసం లక్ష రూపాయలను ప్రైవేట్ డ్రైవర్ మద్దూరికృష్ణయ్య తీసుకోగా, ఆ మొత్తాన్ని అతని వద్ద నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్వో స్వర్ణకుమారి, హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది.స్వర్ణకుమారి, శ్రీనివాస్, మద్దూరికృష్ణయ్యలను నాంపల్లిలోని I అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
#RangareddyDMHO #SwarnaKumari #ACBTelangana #ACB #ACBTrap #ACBRaid #BribeCase #Rangareddy #DMHO #HealthInspector #Srinivas #Maddurikrishnaiah #Corruption #TelanganaNews #HyderabadNews #RangareddyNews #PhysiotherapyCentre #Bribe #TelanganaBreakingNews #VSRBreakingNews
