వైఎస్ షర్మిల కూతురు నిశ్చిత్తార్థానికి సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కొత్వాల్‌గూడలో నిర్వహించిన ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కాబోయే వధూవరులను సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరై అంజిలి రెడ్డి–రఘురామ్ రెడ్డి దంపతులను ఆశీర్వదించారు. వీరి వివాహం నవంబర్ 25న జరగనున్నది.
#YSSharmila #AnjiliReddy #RaghuramReddy #RevanthReddy #GaddamPrasadKumar #PonguletiSrinivasReddy #Kotwalguda #TelanganaNews #TelanganaPolitics #Ys sharmila daughter Engagement#WeddingNews
