కొండా ఖేత్ ఖ‌తం..?

త‌న కూతురు వ్యాఖ్య‌ల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని మంత్రి కొండా సురేఖ మ‌రో సారి స్ప‌ష్టం చేశారు.పార్టీ అధిష్టానంతో స‌మావేశం కావ‌డం కోసం ఢిల్లీ వెళ్లిన ఆమెకు నిరాశే ఎదురైన‌ట్లు తెలుస్తోంది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ ఆమెకు దొరకలేదు. పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ను క‌లిసిన‌ప్ప‌టికి ఆయ‌న నుంచి ఎలాంటి అభ‌యం రాలేద‌ని స‌మాచారం. దీంతో పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జీ మీనాక్షి నాట‌రాజ‌న్ తో ఆమె స‌మావేశ‌మ‌య్యారు. దీంతో ఆమె మీడియా ముందు త‌న వాద‌న వినిపించే ప్ర‌య‌త్నం చేశారు. నా కుమార్తె వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదన్నారు. త‌న కూతురుకి ఇప్ప‌టికే పెళ్లి అయ్యిందని, ఆమె ఇండిపెండెంట్‌గా ఉందన్నారు. సుస్మిత వ్యాఖ్యలకు నన్ను ఎలా బాధ్యురాలిగా చేస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు. నేను, నా భర్త బీసీలం,తెలంగాణలో బీసీలు 60శాతం ఉన్నార‌ని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

మ‌రో వైపు అంత‌కు ముందు మీడియాతో చిట్ చాట్ చేస్తు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నాపై చర్యలు తీసుకునే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. పదేళ్లపాటు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ఎలా చెప్పుకుంటున్నారని కొండా సురేఖ ప్ర‌శ్నించారు. మంత్రులు, నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ఆమె నన్ను రాజీనామా చేయమని ఇప్పటివరకు చెప్పలేదని తెలిపారు. బీసీకి ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా అని ఆమె ప్ర‌శ్నించారు. పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయన్న సురేఖ‌ వాటికి ఏం సమాధానం చెబుతార‌ని సురేఖ అన్నారు.

కొండా సురేఖ తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో రాష్ట్ర మంత్రి వ‌ర్గం నుంచి ఆమె ను తొల‌గించ‌డం ఖాయ‌మ‌న్న సంకేతాలు స్ప‌ష్ట‌మౌతున్నాయి. ఆమెతో అధిష్టానం రాజీనామా చేయించే అవ‌కాశం ఉంది. ఒక వేళ రాజీనామాకు ఆమె నిరాక‌రిస్తే మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn