పొంగులేటి రాజీనామా చేయాలి.. హరీష్ రావు డిమాండ్

22A నిషేధిత భూములతో లక్షల మందిని ఆగం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తక్షణమే నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.2008లో ULC రద్దయిన తర్వాత, మళ్లీ ఇప్పుడు ఈ భూములను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారని ఆయన నిలదీశారు.ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 7,500 జీవోలతో, మేడ్చల్ జిల్లాలో 6,000 జీవోలతో లక్షలాది ఆస్తులను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చారని హరీష్ రావు విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తన చేతిలోకి రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అధికారులను ఆదేశించి రాత్రికి రాత్రే ఈ ఆస్తులను బ్లాక్ చేయించారని ధ్వజమెత్తారు.ఈ నిర్ణయంతో లక్షలాది అపార్ట్మెంట్లు, ఇళ్లు, ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఆగం చేసిందని హరీష్ రావు ధ్వజమెత్తారు.
