నాంపల్లి కోర్టుకు కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన ఫార్ములా-ఈ (Formula-E) కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారక రామారావు (కేటీఆర్) శుక్రవారం నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తు (Personal Bond) సమర్పించారు. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజు రూ.1 లక్ష చొప్పున మరో రెండు పూచీకత్తులను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ సందర్భంగా కేటీఆర్ లీగల్ టీం మాట్లాడుతూ, ఈరోజు విచారణలో కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌తో పాటు ఇతర పత్రాలను మాత్రమే అందజేశారని, కేసు మెరిట్స్‌పై ఎలాంటి విచారణ జరగలేదని స్పష్టం చేసింది.
కేటీఆర్ తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు చేరుకోగా, ఆయన వెంట పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకుని కేటీఆర్‌ను కలిసి సంఘీభావం తెలిపారు.
