రేవంత్ రెడ్దితో కలిసి వచ్చిన కిషన్ రెడ్డి

మెట్రో రుణం వివాదం నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి గా సమావేశమయ్యారు. ఐఆర్ ఎఫ్ సి నుంచి నిధుల విడుదల పైన వీరిద్దరు చర్చించారు. హైదరాబాద్ మెట్రో ను ఎల్ అండ్ టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. జపాన్ నుంచి తీసుకున్న రుణాన్ని ఐఆర్ ఎఫ్ సి సంస్థ ఎల్ అండ్ టీకి ట్రాన్స్ ఫర్ చేయాలి. కాని గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లనే రుణం ఆగిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. అశ్వినీ వైష్ణవ్ తో భేటీకి తనతో కలిసి రావాలని , రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అయింది. అయితే కిషన్ రెడ్డి కూడా అశ్వినీ వైష్ణవ్ కలవడానికి ముందుకు రావడంతో ఉమ్మడి భేటీ జరిగింది.
