నాలుగున్నర గంటల పాటు కేసీఆర్ విచారణ

మాజీ సీఎం కేసీఆర్ ను దాదాపు నాలుగున్నర గంటల పాటు సిట్ విచారించింది. నందినగర్ నివాసంలో జరిగిన విచారణలో అధికారులు కేసీఆర్ ను అనేక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. కేసీఆర్ సమాధానాలను వీడియో రికార్డు చేశారు. గత విచారణలో భాగంగా పోలీస్ అధికారులు, నాయకులు ఇచ్చిన సమాధానాల ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించారు. విచారణ సమయంలో కేసీఆర్ అధికారులకు పొడి పొడి గా ఆన్సర్స్ చెప్పినట్లు సమాచారం.
