పీసీసీ వాయిదా… రేవంత్ రెడ్డికి నిరాశ
1 min readగత కొన్నాళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష ఎంపికపైన జరుగుతున్న చర్చకు పుల్ స్టాఫ్ పడింది. ఇప్పట్లో పీసీసీ ఛీప్ ఎంపిక ఉండదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాతే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూరు తెలిపారు. అప్పటి వరకు పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని ఆయన వివరించారు. వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా పదువుల్లో ఉంటారని మానిక్కం ప్రకటించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసేంత వరకు పీసీసీ అధ్యక్ష పదవిపైన నిర్ణయం తీసుకోవద్దని సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్ ను కోరారు. పీసీసీపైన నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం, ఒకరిపైన మరొకరు విమర్శలు చేసుకోవడం పార్టీకి నష్టం చేస్తుందని ఆయన ఢిల్లీ పెద్దలకు తెలిపారు. దీని ప్రభావం నాగార్జున సాగర్ పైన పడుతుందని జానారెడ్డి వారికి వివరించారు. జానారెడ్డి సూచన మేరకే పీసీసీ అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేశామని మానిక్కం ఠాగూరు వివరించారు. తెలంగాణకు కాంగ్రెస్ మూలస్థంభాల్లో జానారెడ్డి ఒకరని, ఆయన సాగర్ లో పార్టీ తరుపున పోటీ చేస్తున్నారని మానిక్కం అన్నారు. ఆయన మాటను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
పీసీసీ అధ్యక్ష ఎంపిక వాయిదా పైన రేవంత్ రెడ్డి అభిమానులు నిరాశలో మునిగిపోయారు. రేవంత్ కు పీసీసీ ఖాయమని కాంగ్రెస్ లో ఆయన వర్గం అంచనా వేసింది. అయితే తాజా పరిణామాలు వారికి మింగుడుపడటం లేదు. కొంత మంది సీనియర్లు కావాలనే గందరగోళం స్రుష్టించారని వారు ఆరోపిస్తున్నారు.