చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
1 min readస్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి హైకోర్టు భారీ ఊరట లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయన రాజకీయ కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు విధించ లేదు. ప్రస్తుతం ఇదే కేసులో ఆయన మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు గతంలో బెయిల్ ఇచ్చింది. ఈ నెల 28న రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాల్సి ఉంది. అయితే హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో ఆయనకు ఊరట లభించింది.
హైకోర్టు బెయిల్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాజకీయ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన కు సిద్ధమయ్యే అవకాశం ఉంది. మరో వైపు నారా లోకేష్ కూడా తన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించబోతున్నారు.