తుమ్మలతో పొంగులేటి భేటీ
1 min readమాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. ఆ పార్టీ ప్రముఖులు ఆయనను పార్టీలో ఆహ్వానిస్తున్నారు. ఇటీవలె పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లో చేరాల్సిందిగా కోరారు. ఆ తర్వాత ఆయనను వెంటబెట్టుకొని బెంగళూరు వెళ్లి కర్ణాటక డిప్యూటీ సిఎం డీకె శివకుమార్ తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తాజాగా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో తుమ్మల ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నేతల అహంకారాన్ని అణిచివేయాలంటే తమతో కలిసి రావాలని ఆయనను కోరారు. అనుచరులతో మాట్లాడిన తర్వాత చేరికపైన నిర్ణయం తీసుకుంటానని తమ్మల తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.