బండి అవుట్..కిషన్ రెడ్డి ఇన్
1 min readతెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో ఎన్నికలు అతి సమీపంలో ఉండటంతో బీజేపీ అధిష్టానం మరింత ద్రుష్టి సారించింది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడం లేదా పార్టీ జాతీయ కార్యవర్గంలో అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు చెపుతున్నారు. ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని తిరిగి తెలంగాణకు పంపనున్నారు.
బండి సంజయ్ వ్యవహారశైలిపైన తెలంగాణ బీజేపీ నేతలు కొందరు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. బండి నాయకత్వంలో ఎన్నికలు వెళ్తే పార్టీకి చావు దెబ్బ తప్పదని వారు అధిష్టానానికి తేల్చిచెప్పారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు అమిత్ షాకు ఈ విషయాన్ని బలంగా చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వివాదరహితుడుగా పేరున్న కిషన్ రెడ్డి అందరిని కలుపుకొని వెళ్తాడని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు. ఆయన గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.