కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే గురున్నాథ్ రెడ్డి
1 min readకొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురున్నాథ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆదివారం గాాంధీభవన్ లో ఆయన చేరిక కార్యక్రమం ఉండనున్నది. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా గురున్నాథ్ రెడ్డి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్ చేరే ఛాన్స్ ఉంది. కొడంగల్ లో గురున్నాథ్ రెడ్డికి గట్టి పట్టుంది. కాంగ్రెస్ లో ఆయన చేరితే రేవంత్ రెడ్డికి కొడంగల్ మరింత బలం చేకూరనున్నది.
కొడంగల్ నుంచి గురున్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఐదు సార్లు విజయం సాధించారు. స్థానికంగా ఆయనను దొర అని పిలుస్తారు. 2009,2014 ల్లో గురున్నాథ్ రెడ్డిపైనే రేవంత్ రెడ్డి విజయం సాధించారు. రేవంత్ రెడ్డి మొదటి సారి ఇక్కడ పోటీ చేసినప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది. ఎన్నికల ప్రచార సమయంలో ఒకసారి రేవంత్ రెడ్డిపైన దాడి జరిగింది.
కొడంగల్ లో ఎట్టి పరిస్థితుల్లోను రేవంత్ రెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో గత ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దింపింది. దీంతో గురున్నాథ్ రెడ్డి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తగిన గుర్తింపు లేకపోవడంతో గురున్నాథ్ రెడ్డి బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత కాలం క్రితం రేవంత్ రెడ్డి స్వయంగా కొడంగల్ లోని ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. తాజాగా మరో సారి హైదరాబాద్ లో గురున్నాథ్ రెడ్డిని కలిశారు.