రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ కాల్

1 min read

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. టీఎస్ పిఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపైన ఉమ్మడి పోరాటం చేద్దామని ఆమె కోరారు. ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలన్ని కలిసి చేద్దామని షర్మిల ప్రతిపాదించారు.  సిఎం కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్షాలను బతకనిచ్చేలా లేరని ఆమె రేవంత్ రెడ్డితో వ్యాఖ్యానించారు. కేసీఆర్ మెడలు వంచడానికి అంతా ఐక్యంగా పోరాడుదామన్నారు. అయితే పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. మరో వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కూడా షర్మిల ఫోన్ చేశారు. ఉమ్మడి పోరాటానికి తాము సిద్ధమని ఆయన షర్మిలకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn