కవిత అరెస్ట్ కు రంగం సిద్దం..?
1 min readతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్దమైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు రావాలని మరో సారి కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న ఢిల్లీలో ఈడీ ఆఫీసుకు రావాలని ఆమెకు సమాచారం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం 10న జంతర్ మంతర్ లో నిరాహార దీక్ష కు కవిత సిద్ధమౌతున్న సమయంలో నోటీసులు వచ్చాయి. దీంతో కవిత అరెస్ట్ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.అరుణ్ పిళ్లై ను కవిత బినామీగా ఈడీ పేర్కొన్న ఇరవై నాలుగు గంటల్లోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే దర్యాప్తు సంస్థలతో సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బిజెపి తెలుసుకోవాలని కవిత స్పఫ్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటామన్నారు.